ఘనంగా కరాటే బెల్ట్ అవార్డుల ప్రదానోత్సవం

ఘనంగా కరాటే బెల్ట్ అవార్డుల ప్రదానోత్సవం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో శుక్రవారం కరాటే బెల్టింగ్ అవార్డు కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వివిధ స్థాయిల బెల్టులను, సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ బెల్ట్ 7 డాన్ రచ్చ శ్రీను బాబు హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోట జగదీష్, వీడీసీ ప్రెసిడెంట్ పతని కృష్ణ మరియు అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు ఆడటం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని, ఇది విద్యార్థులు చదువులో రాణించడానికి దోహదపడుతుందని తెలిపారు.
విద్యార్థుల ప్రతిభకు అభినందనలు..
కరాటే శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ పెరుగుతుందని అతిథులు కొనియాడారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆ. పవన్, టీ. సురేష్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
