Parliament | వీరభద్ర స్వామికి పట్టు వ‌స్త్రాలు…

Parliament | వీరభద్ర స్వామికి పట్టు వ‌స్త్రాలు…

Parliament | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా ఐరాల మండలం కుల్లంపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామికి, నాగంవాండ్లపల్లి పంచాయతీలోని వీరభద్రస్వామికి పాటూరు సవటపల్లి శ్రీ కాలభైరేశ్వర ఆలయంలో తవనంపల్లి మండలంలో వెలసిన కాలభైరేశ్వర స్వామికి మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టు వస్త్రాలను చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళి మోహన్ పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయం నుంచి ఆ ఆలయ పాలకమండలి అధ్యక్షులు శ్రీ మణి నాయుడు, ఆలయ ఈ.వో. పెంచల్ కిషోర్ నేతృత్వంలో తెచ్చిన పట్టు వస్త్రాలను చిత్తూరు పార్లమెంటు సభ్యులు, దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, ఐరాల మండలం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి సమర్పించారు.

ఈ ఆలయాలకు చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆలయ నిర్వాహకులు, అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యే మురళీమోహన్, ఐరాల మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామి సేవలో తరించారు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి, శ్రీ సతీ సమేత కాలభైరవేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ప్రజలందరికి అందాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజలకు అన్నదాన వితరణ చేశారు.

అనంతరం ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కన్వీనర్ గిరిధర్ బాబు, ఐరాల మండలాధ్యక్షులు హరి బాబు నాయుడు, మాజీ ఎంపీపీ మురళి మోహన్, ఐ టిడిపి అధ్యక్షులు సొప్పా నాని, కాణిపాకం ఆలయ పాలకమండలి సభ్యులు నాగరాజు నాయుడు, ఐరాల క్లస్టర్ ఇన్చార్జు మోహన్, దేవాజీ గారు, బంగారుపాళెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర నాయుడు, టిడిపి చిత్తూరు పార్లమెంటు జిల్లా కార్యదర్శి ధరణి ప్రకాష్, మాజీ కార్యనిర్వహక కార్యదర్శి సురేంద్ర కుమార్, వేదగిరి వారిపల్లె సర్పంచ్ శ్రీ ప్రశాంత్, కాళబైరేశ్వస్వామి వారి ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply