Shahi Masjid : షాహీ మస్జీద్‌ పరిరక్షణ అనివార్యం Andhra Prabha News

Shahi Masjid : షాహీ మస్జీద్‌ పరిరక్షణ అనివార్యం Andhra Prabha News

ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్

(యడ్లపాడు, ఆంధ్రప్రభ):

Shahi Masjid : పల్నాడు జిల్లా, చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండవీడు కోట ప్రాంతంలో ఉన్న పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని షాహీ మస్జీద్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ఆదివారం సందర్శించారు.ఈ సందర్భంగా షాహీ మస్జీద్ యొక్క చారిత్రక విశిష్టత, అక్కడి నిర్మాణ శైలి, పురాతన వారసత్వ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి స్థానిక ప్రజలు సంబంధిత అధికారులతో చర్చించారు. మస్జీద్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన, ఇటువంటి చారిత్రక ఆధ్యాత్మిక కట్టడాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.అదేవిధంగా మౌలానా ముస్తాక్ అహ్మద్ మస్జీద్‌లో నమాజ్ చదివించి ప్రత్యేక దువా చేయడం జరిగింది. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరియు ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు నిర్వహించారు.అలాగే, కొండవీడు కోట ప్రాంతం పర్యాటక చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని అన్నారు. ఈ సందర్శన సందర్భంగా స్థానిక ముస్లిం సోదరులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Leave a Reply