ఉత్కంఠ భరితంగా పరకాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా జరిగాయి. పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా ఎన్నికల అధికారులు ఒక రౌండులో ఏడుగురి అభ్యర్థుల ఓట్లను లెక్కింపు చేయడానికి ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు చేశారు. వార్డుల వారిగా గెలుపొందిన వారి వివరాలు 1వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి (259) మెజారిటీ, 2వ వార్డు లో బిఆర్ఎస్ అభ్యర్థి బొచ్చు శ్యామల బాబురావు(39) మెజారిటీ, 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పొరండ్ల మౌనిక వేణు (180) మెజారిటీ, 4 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకు దివ్య (26) మెజారిటీ, 5వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి గొడుగు రజిత నాగరాజు(90) మెజారిటీ, 6 వ వార్డు లో బిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల రాణి రవి (66)మెజారిటీ, 7వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ కుమార్(173) మెజారిటీ, 8వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమారస్వామి (51 )మెజారిటీ, 9వ వార్డులో బిజెపి అభ్యర్థి బెజ్జంకి పూర్ణ చారి (369) మెజారిటీ, 10 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పసుల లావణ్య రమేష్ (70) మెజారిటీ, 11వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి గూడెల్లి సదన్ కుమార్ (26)మెజారిటీ, 12 వ వార్డు లో బిజెపి అభ్యర్థి ఆకుల లావణ్య శ్రీధర్ (55) మెజారిటీ, 13 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు మాధవి లత (13) మెజారిటీ, 14వ వార్డు లో బిఆర్ఎస్ అభ్యర్థి పడిదల దీప్తి రాకేష్(254) మెజారిటీ, 15వ వార్డులో బిజెపి అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ (112) మెజారిటీ, 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బండి శ్రీధర్ (152) మెజారిటీ, 17 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర సాల్మాన్(1) మెజారిటీ, 18వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి(66) మెజారిటీ, 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొయ్యడ శ్రీనివాస్( 207)మెజారిటీ, 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాలకుర్తి శ్రీనివాస్(16) మెజారిటీ, 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుధమల్ల రమేష్ (59)మెజారిటీ, 22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అల్లె దశరథం (79)మెజారిటీ లతో గెలుపొందారు.
