అధ్వానంగా మల్లక్కపేట గ్రామ రోడ్డు
అధ్వానంగా మల్లక్కపేట గ్రామ రోడ్డు
- రోడ్డులో గుంతలతో పాటు కంకర తేలిన వైనం
- అంతర్గత రోడ్లు కూడా అధ్వానంగా మారాయి
- వర్షాకాలం ఇబ్బందికర పరిస్థితులు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం మల్లక్కపేట గ్రామ రోడ్డు గుంతలతోపాటు కంకర తేలి అద్వానంగా మారింది. వర్షాకాలం ఈ రోడ్డు లో ప్రయాణించాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మల్లక్కపేట గ్రామానికి మొదలయ్యే రోడ్డు నుండి గ్రామపంచాయతీ వరకు గుంతలు మయంగా మారింది. అదేవిధంగా గ్రామం లోని కాలనీలకు వెళ్లే రోడ్డు మార్గం కంకర తేలి ఉండడం గ్రామంలోని ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు దాపురించాయి.

వర్షాకాల దృష్ట్యా గుంతల రోడ్డులో నీళ్లు నిలిచే అవకాశం ఉన్నందున రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలోని అంతర్గత రోడ్లలో కంకర తేలి ఉండడం వలన వ్యవసాయ పనులకు వెళ్లే వారికి వాటిపై నడవడం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మల్లక్కపేట గ్రామానికి వెళ్లే రోడ్డును, గ్రామంలోని అంతర్గత రోడ్లును మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు కోరుకుంటున్నారు.
