శిక్షణ తరగతులకు తరలిన కల్లు గీత కార్మిక సంఘం నాయకులు
కాజీపేట (ఆంధ్రప్రభ): హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న కల్లు గీత కార్మిక సంఘం శిక్షణ తరగతులకు హన్మకొండ జిల్లా నాయకులు సోమవారం తరలివెళ్లారు. జిల్లా కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరిన రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు కాజీపేటలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌని సాంబయ్య గౌడ్ జెండా ఊపి శుభాకాంక్షలు తెలిపారు.
శిక్షణ తరగతులు సంఘ బలోపేతం, కార్మికుల సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రంజిత్ గౌడ్, కోతి సాంబరాజు గౌడ్, మోటపోతుల రాజు గౌడ్, ఆముదాలపల్లి మల్లేశం గౌడ్, దూలం ప్రభాకర్ గౌడ్, బుర్ర స్వప్న గౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ సారా వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
అలాగే జిల్లా కమిటీ సభ్యులు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, బండి సదానందం, మార్క్ రఘుపతి గౌడ్, బత్తినీ శ్రీనివాస్ గౌడ్, కుర్ర సాంబమూర్తి గౌడ్, బుర్ర సమ్మయ్య, మాచర్ల కుమారస్వామి, కళ్లేపు శోభారాణి గౌడ్, పబ్బు ఉమా రాజేందర్ గౌడ్, గడ్డం వీరయ్య, చింత శ్రీనివాస్, పంజాల సాంబరాజు, బోనగాని రమేష్, ముంజ విజేందర్, రంగు ప్రశాంత్ తదితరులు శిక్షణ తరగతులకు హాజరయ్యేందుకు బయలుదేరారు.
