Duties | శివరాత్రి ఏర్పాట్ల పై సూచనలు

Duties | శివరాత్రి ఏర్పాట్ల పై సూచనలు
- మూడు ప్రాంతాల్లో విధులు నిర్వహణ పై సమీక్ష
- తాసిల్దార్ వై సరస్వతి
Duties | వి ఆర్ పురం, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15న వివిధ ఆలయాలలో జరిగే స్వామివారి కల్యాణోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా శుక్రవారం తమ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సూచనలు చేశారు జీడిగుప్పు గోదావరి నది వద్ద అవతలకు వెళ్లే భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
అదేవిధంగా వడ్డీ గూడెం రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం రేకపల్లి లో గల కోట మైసమ్మ ఆలయంలో కూడా అన్ని ఏర్పాట్లను చూడాలని ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఆయా ఆలయాల వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చూసి తగు జాగ్రత్తలతో విజయవంతం చేయాలని తాసిల్దారు వై సరస్వతి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
