21 892 voters | ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

21 892 voters | ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు
- మూడు మునిసిపలిటీల్లో ముగిసిన పోలింగ్
- రైటప్: మక్తల్ మున్సిపల్ కార్యాలయం
21 892 voters | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నియోజకవర్గంలోని మక్తల్, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మక్తల్ మున్సిపాలిటీలో మహిళలు 11213 మంది పురుషులు 10679 మంది ఓటర్లు ఉండగా మొత్తం 21 892 మంది ఓటర్లు ఉన్నారు.
బుధవారం జరిగిన పోలింగ్లో మహిళలు 7756 మంది పురుషులు 7613 మంది మొత్తం 15369 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో మక్తల్ మున్సిపాలిటీలో 70.20 శాతం ఓటింగ్ నమోదయింది .అదేవిధంగా నియోజకవర్గంలోని అమరచింత మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 91 47 కాగా…. మహిళలు 4364 పురుషులు 4783 గా ఉన్నారు.
ఎన్నికల్లో మహిళలు 3685 మంది పురుషులు 3960 మంది తమ ఓట్లను వేయగా మొత్తం 7645 మంది ఓట్లు నమోదైనట్లు కమిషనర్ తెలిపారు. ఇక్కడ 83.58 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా ఆత్మకూరులో మున్సిపాలిటీ లో మొత్తం ఓటర్లు 11579 ఉండగా 8958 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
