AP | సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి

AP | సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి

AP | మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని బుధవారం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి దర్శించుకున్నారు. వీరికి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు అందజేశారు. తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జీయర్ స్వామీజీ నిర్వహించారు. భక్తులు ఆయన దర్శనార్థం విచ్చేశారు.

Leave a Reply