TG | పెద్దపులి దాడి..

TG | పెద్దపులి దాడి..
TG |రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గురువారం రాత్రి రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామంలో పరిశె రాజు వ్యవసాయ బావి వద్ద లేగ దూడను పులి చంపినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. రాత్రి సమయాల్లో పొలాల వద్దకు రైతులు వెళ్ళవద్దు అని, అత్యవసరం అయితేనే ఇంట్లో నుండి బయటికి రావాలని అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు.

