Breaking | బాసరలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
ఆంధ్రప్రభ, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్)లో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కళాశాల భవనం పై నుంచి దూకినట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన కళాశాల యాజమాన్యం, సిబ్బంది వెంటనే స్పందించి విద్యార్థినిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఘటనపై కళాశాల యాజమాన్యం, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
