ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో మార్పు..
ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో మార్పు..
నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి
కడెం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ఇండ్లు మంజూరు చేసి వారి జీవితాల్లో మార్పు తెస్తుందని నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి అన్నారు బుధవారం కడెం మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో కడెం మండల కాంగ్రెస్ నాయకులు హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తూ, నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందన్నారు సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి ఒక కల, ఆ కలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు పేదల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ప్రజల అభివృద్ధి, ప్రాంతీయ పురోగతికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గఈ కార్యక్రమానికి ప్రధానంగా సహకరించి, నియోజకవర్గ అభివృద్ధిలో తన పాత్రను మరొకసారి చాటిచెప్పారన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందుతున్నారన్నారు
ఈ కార్యక్రమంలో నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి, నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్, కడెం మాజీ వైస్ ఎంపీపీ కట్ట శ్యామ్, కొత్త మద్ది పడగ సర్పంచ్ జడ లావణ్య కృష్ణయ్య ఉప సర్పంచ్ బండారి జనార్దన్, నచ్చన్ ఎల్లపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుల్లె వెంకటేష్, దుల్లె దినేష్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చింతం రాజన్న, మరియు ఎం.బి. రాజన్న, స్థానిక పంచాయతీ సెక్రటరీ పద్మ పాల్గొన్నారు.
