Minister | బీజేపీని గెలిపించండి.. 500 కోట్లు తెస్తా..
Minister | బీజేపీని గెలిపించండి.. 500 కోట్లు తెస్తా..
- పంచాయతీలకు 250 కోట్లు ఇచ్చాం..
- రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మిగిలింది శూన్యం..
- మున్సిపాలిటీలకు నిధుల వరద కురిపిస్తా..
- కేంద్రం నిధులతోనే అభివృద్ధి సాధ్యం..
- హుజూరాబాద్ లో స్టేడియం నిర్మిస్తా..
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Minister | హుజురాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని, గెలిచిన వెంటనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.500 కోట్ల నిధులు తెచ్చే బాధ్యత నాదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… గ్రామపంచాయతీ కోసం కేంద్రం ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులను విడుదల చేసిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తనచొ రవ వల్లే నిధులు విడుదలయ్యాయన్నారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది శూన్యమని ఎద్దేవా చేశారు. తమకు మోసపు మాటలు చెప్పడం చేతకాదని, కాంగ్రె స్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా దొంగ హామీలు ఇవ్వలేమని, మాట ఇచ్చామంటే తప్పకుండా నెరవేర్చి తీరుతామన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే ఢిల్లీకి పోయి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి హుజూరాబాద్ పట్టణం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.

హుజూరాబాద్ లో మినీ స్టేడియం నిర్మాణం కోసం కె ంద్రం నుండి నిధులు తీసుకొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించడంవల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఎన్నికలైన వెంటనే స్టేడియం నిర్మాణం పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటానని, ఎవరు అడ్డు వస్తారో చూస్తానన్నారు. హుజూరాబాద్ పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చిన ఘనత తనదేనని, కేంద్ర ప్రభుత్వం వాుజూరాబాద్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులిచ్చిందో.. ఏమేం పనులు జరిగాయో పూర్తి వివరాలతో సహా బుక్ లెట్ సిద్ధం చేయించామని, ఇంటింటికీ పంపుతామన్నారు.
14, 15వ | ఆర్థిక సంఘం ద్వారా 19 కోట్ల 57 లక్షలు, స్వచ్ఛ భారత్ ద్వారా 1 కోటి 10 లక్షలు, అమృత్ స్కీం కింద 16 కోట్ల 25 లక్షలు, స్వనిధి ద్వారా 4వేల 377 మందికి 7 కోట్ల 63 లక్షలు, పట్టణ మౌలిక సదుపాయాల నిధుల) ద్వారా 36 కోట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వీధి దీపాల మొదలు, రోడ్లు, డ్రైనేజీ, స్మశాన వాటిక నిర్మాణం దాకా అన్నీ కేంద్ర నిధులేనని, వీటితోపాటు సీఎస్సార్, ఎంపీ లాడ్స్ నిధులతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి హుజూరాబాద్లో ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్ మెంట్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని, డాక్టర్లు, సిబ్బంది ఆశించిన స్థాయిలో లేరన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు ఇచ్చానని, టెన్త్ పరీక్ష ఫీజు కూడా తన జీతం నుండే చెల్లించినట్లు తెలిపారు.
బీజేపీకి మున్సిపల్ చైర్మన్ పీఠం అప్పగించిన వెంటనే హుజూరాబాద్ పట్టణంలో అర్థాంతరంగా నిలిచిన మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయిస్తానని, పట్టణంలోని నిరుపేదలకు ఇళ్ల మంజు చేయిస్తానని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణికి తక్షణ చర్యలు చె పడతామన్నారు. పట్టణంలో అవసరమైన చోట మురుగు కాలువలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, హుజూరాబాద్ సుందర పట్టణాలుగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు. హుజూరాబాద్ లో కూడా మినీ స్టేడియం ఏర్పాటుకు కేంద్ర మంత్రిగా ప్రత్యేక చొరవ తీసుకొని నిధుల మంజూరికి కృషి చేస్తానన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికే పెద్దదిక్కుగా ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపు మాటలు నమ్మి మోసపోయారని, అందుకే మంచి పాలన కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ఎన్నికల ఇంఛార్జ్ ఎర్రం మహేశ్తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
