చీకోటి ప్రవీణ్ జన్మదినం సందర్భంగా అన్నదానం
కరీంనగర్ టవర్ సర్కిల్, ఆంధ్రప్రభ : ఆర్యవైశ్య సంఘం నాయకుడు, ప్రముఖ సామాజికవేత్త చీకోటి ప్రవీణ్ జన్మదిన వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం టవర్ సర్కిల్లో పల్లెర్ల రాజకిరణ్ సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే కార్పొరేటర్లు టింకు, రామన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు రావికంటి భాగ్యలక్ష్మి, తొడుపునూరి తిరుపతి, బొడ్ల వేణు, గౌరిశెట్టి మునీందర్, పల్లెర్ల వేణుమాధవ్, కైలాస నవీన్, తాటిపెల్లి సుభాష్, జీడిగి సాయి, ఆకుల మెహర్, శ్రీకాంత్, వేణు, సుమన్, వెంకటేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
