ఆదరించండి అభివృద్ధి చేసే బాధ్యత నాదే

సుంకరి సౌమ్య ( సురేష్ )

భీమ్‌గల్‌ టౌన్, ఫిబ్రవరి 3 ( ఆంధ్రప్రభ ) కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను ఆదరించి గెలిపించాలని సుంకరి సౌమ్య ( సురేష్ ) కోరారు. బుధవారం 12 వ వార్డు లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు లో ఉన్న సమస్యలను బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ సహకారంతో పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. గల్లీ లీడర్ గా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు. ఇంటింటికి నల్లా ద్వార నీరు, మురికి కాలువల నిర్మాణం, సీసీ డ్రైన్స్, రోడ్స్ నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. అవినీతి కి ఆస్కారం లేకుండా సేవ చేస్తానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply