Trump | బలపడిన రూపాయి…

Trump | బలపడిన రూపాయి…

Trump | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనతో భారత స్టాక్‌ మార్కెట్లు వేగం పుంజుకున్నాయి. రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేస్తున్నాయి. భారత్‌పై విధించిన సుంకాలను 50శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది దేశీయంగా మదుపర్లలో సానుకూల ఎఫెక్ట్‌ చూపించింది.

దీంతో భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా ఒక శాతానికి పైగా పెరిగి రూ.90.30 స్థాయికి వెళ్తుంది. ప్రస్తుతానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్‌ 2300 పాయింట్లకు పైగా చేరింది. 84 వేల పాయింట్ల స్థాయిలో ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్‌ ఎక్స్చేంజి సూచి నిఫ్టీని చూస్తే 700 పాయింట్లు పుంజుకుని 25,780 స్థాయిలో వెళ్తోంది. ఇటీవల చూసుకుంటే స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇంతటి స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి.

Leave a Reply