Mitra Youth | రూ.60 వేల ఆర్థిక సహాయం అందజేత

Mitra Youth | రూ.60 వేల ఆర్థిక సహాయం అందజేత

Mitra Youth | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన మిత్ర యూత్ సభ్యుడు కన్నెబొయిన సతీష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మిత్ర యూత్ ఆధ్వర్యంలో సేకరించిన నగదు రూ.60 వేల ను గురువారం మృతుడి కుటుంబ సభ్యులకు మిత్ర యూత్ సభ్యులు స్వయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మిత్ర యూత్ గౌరవ సలహాదారులు పురుగుల వెంకన్న, ఉపాధ్యక్షడు కొంతం సత్తయ్య, కార్యదర్శి పయ్యాముల శ్రీను, ప్రచార కార్యదర్శి బొడ్డుపల్లి సతీష్ ,పిట్టల బాలయ్య, వాసం ప్రసాద్, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, జంగ సతీష్, మోత్కూర్ ప్రదీప్ శర్మ, బుర్ర శివమల్లేష్, ఇక్కరి నాగరాజు, మల్లయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు మోత్కూర్ మున్సిపాలిటీలోని అంగడి బజార్ యువసేన యూత్ ఆధ్వర్యంలో మరో రూ.6వేల ఆర్థిక సహాయంగా అందజేశారు.