అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
- సిఆర్ పల్లి గ్రామపంచాయతీలో అంబేద్కర్ చిత్రపటం అందజేత
చిట్యాల, ఆంధ్రప్రభ : అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని భూపాలపల్లిజిల్లాఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకుడు నేరెళ్ల ఓదెలు మాదిగ , కోరారు. శనివారం మండలంలోని చింతకుంట రామయ్య పల్లి నూతన గ్రామపంచాయతీ కి అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి గ్రామ సర్పంచ్ మట్టికే సుజాత- రవీందర్ కు నేరెళ్ల ఓదెలు అందజేశారు.
అనంతరం ఓదెలు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఫోటోను మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయలలో పెట్టకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్, అన్ని ప్రభుత్వ కార్యాలయలలో, పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ ఫోటో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవాబు పేట గ్రామ సర్పంచ్ పర్లపెల్లి రవి,ప్రధానోపాధ్యాయులు, శనిగరపు భద్రయ్య,వార్డ్ మెంబర్ బొజ్జం నవీన్, రాజు, రజిని,దేవేందర్ రావు, గ్రామపంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు.
