మోత్కూర్ శాఖా గ్రంథాలయంలో ‘డే విత్ లైబ్రరీ’ ప్రారంభం

మోత్కూర్ శాఖా గ్రంథాలయంలో ‘డే విత్ లైబ్రరీ’ ప్రారంభం

మోత్కూర్, ఆంధ్రప్రభ: వేసవి సెలవుల్లో విద్యార్థులను సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు మోత్కూర్ శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో చేపట్టిన “డే విత్ లైబ్రరీ” (గ్రంథాలయంలో ఒక రోజు) కార్యక్రమం ప్రారంభమైంది.

పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తొలి రోజు 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్య గిరి తెలిపారు.

మే 12 నుంచి జూన్ 12 వరకు గ్రంథాలయ పనివేళల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు విద్యార్థులు గ్రంథాలయంలో గడపవచ్చని తెలిపారు.

అధిక రోజులు గ్రంథాలయంలో పుస్తక పఠనంలో పాల్గొన్న 10 మంది విజేతలకు రూ.2,500 నగదు బహుమతితో సత్కరిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదని, విద్యార్థులకు స్నాక్స్ కూడా అందజేస్తామని తెలిపారు. ప్రముఖులతో ప్రేరణాత్మక తరగతులు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ వైస్‌ చైర్మన్ పోచం బిక్షపతి, లైబ్రరీ ఇన్‌చార్జి చిలకమర్రి బాబుచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply