మున్సిపాలిటి ఆధ్వర్యంలో చలివేంద్రం

మున్సిపాలిటి ఆధ్వర్యంలో చలివేంద్రం

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, కమీషనర్ బి. శ్రీనివాస్ లు ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. వేసవిలో వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కోతి సంపత్ రెడ్డి, వల్లపుదాసు కృష్ణ, పులిచింతల వెంకటరెడ్డి, జక్కుల మల్లయ్య, దొంతిరెడ్డి పద్మారెడ్డి, నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply