‘అగ్ని వీర్’ లో సత్తా చాటిన సిరిపురం యువకులు

నడిగూడెం, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన యువకులు ఇండియన్ ఆర్మీ ‘అగ్నివీర్’ ఎంపికలో ప్రతిభ చాటారు. గ్రామానికి చెందిన పసుపులేటి పండు, మొక్కా సురేష్, చింతలపాటి లక్ష్మణ్ భారత సైన్యంలో ‘అగ్నివీర్’ నియామకంలో జనరల్ డ్యూటీ విభాగానికి ఎంపికయ్యారు.
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు భారత సైన్యంలో ఎంపిక కావడం పట్ల గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. గ్రామస్థులు ఈ విజయాన్ని అభినందిస్తూ యువకుల కృషిని ప్రశంసించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంపటి రామారావు, దేవస్థాన చైర్మన్ తాళ్లూరి రమేష్, మాజీ సర్పంచ్ పసుపులేటి జనార్ధన్, శెట్టి సతీష్, వెంకట్ నారాయణ, శ్రీహరి, ఆసన్న వెంకటేశ్వర్లు, చలపతి, కస్తూరి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
