Madaram | గోదావరిఖని సమ్మక్క జాతరకు భారీ ఏర్పాట్లు

Madaram | గోదావరిఖని సమ్మక్క జాతరకు భారీ ఏర్పాట్లు

  • రూ. 9 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు
  • రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
  • భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు : కలెక్టర్

Madaram | గోదావరిఖని, ఆంధ్రప్రభ : గోదావరిఖనిలోని గోదావరి నది ఒడ్డున మూడున్నర దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారం తరహాలో భారీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ తెలిపారు. ఈ రోజు సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ భూక్య రామ్ రెడ్డి, సింగరేణి జిఎం లలిత్ కుమార్, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ మాట్లాడుతూ గోదావరిఖని పట్టణంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. సుమారుగా 9 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అభివృద్ధి పనులు గడిచిన మూడు నెలలుగా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Madaram |

సింగరేణి సంస్థ నుండి 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతుండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారుగా రెండు కోట్ల రూపాయలతో జాతరలో భక్తుల సౌకర్యాలకు సంబంధించి ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో జరిగిన అమ్మవారి జాతరకు సుమారుగా 5 లక్షల పైచిలుకు భక్తులు వచ్చారని…. ప్రస్తుతం మరో ఐదు రోజులలో ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరకు సుమారుగా 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

Madaram |

రోడ్లు డ్రైనేజీ తాగునీటి సౌకర్యం పారిశుద్ధ్య నిర్వహణ స్నానాల గదులు, మరుగుదొడ్లు, వైద్య సౌకర్యం…ప్రత్యేక కరెంటు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా జాతర కొనసాగినన్ని రోజులు వందల మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు, అలాగే సీసీ కెమెరాల నిర్వహణ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

భవిష్యత్తులో అమ్మవారి జాతరను ఊహించని రీతిలో అభివృద్ధి చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. జాతర నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఏర్పడకుండా మీడియాను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేకంగా కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భక్తులకు జాతరలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Madaram |

జాతరలో 24 గంటలు మున్సిపల్ సిబ్బంది భక్తుల సౌకర్యాల విషయంలో పూర్తిస్థాయిలో బాధ్యతగా పనిచేస్తారని పేర్కొన్నారు. గోదావరిఖని ఏసిపి మడత రమేష్, ఎస్ ఓ టు జి ఎం చంద్రశేఖర్, ఎండోమెంట్ అధికారి కాంతారెడ్డి, జాతర కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సిఐలు ఇంద్రసేనారెడ్డి, ఎన్ ప్రసాదరావు, సివిల్ డీజిఎం వరప్రసాద్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్ , జాతర కమిటీ సభ్యులు బంగారి రాజయ్య, జక్క వేణి కనకయ్య, ముక్క రాజయ్య, మల్లేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : 23rd jan Vasantha Panchami | వాగ్దేవి ఉపాసనలో అంతరార్థం – వైదిక విశ్లేషణ

CLICK HERE TO READ MORE :

Leave a Reply