Public issues | ప్రజా సమస్యలు ఎజెండాగా…ఆంధ్రప్రభ పత్రిక

Public issues | ప్రజా సమస్యలు ఎజెండాగా…ఆంధ్రప్రభ పత్రిక

Public issues | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : స్వాతంత్రనికి ముందు నుండి ప్రజా సమస్యలు ఎజెండాగా పని చేస్తున్న పత్రిక ఆంధ్రప్రభ అని నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు మండలకేంద్రంలో ఆంధ్రప్రభ 2026 క్యాలెండరు ఆవిష్కరించారు. ఏ రాజకీయ పార్టీ కి అనుకూలంగా వ్యతిరేకం గా కాకుండా నిజాలు నిర్భయంగా వెలికి తీస్తున్న పత్రిక ఆంధ్రప్రభ అని అన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్, యూ ట్యూబ్, పత్రిక రంగాల్లో ఆంధ్రప్రభ సమాజంలోని యదార్థ సంఘటనలను ప్రజలకు చేరవేస్తుంని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, డైరెక్టర్ సురేష్, నాయకులు సిరిపురం నగేష్, సిరాజ్, నాయిడి రవి, శ్రీకాంత్ గౌడ్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.