పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సిపిఐ నిరసన..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. లీటర్‌కు రూ.3 పెంపుతో సామాన్య ప్రజలపై భారమైందని సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ విమర్శించారు. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల ప్రభావంతో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పెరుగుతున్న ధరల వల్ల రవాణా రంగం, రైతులు, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు బోనగిరి మహేందర్, సంగేమ్ మధు, కల్లూరి బాలమల్లు, బోనగిరి శ్రవణ్, దొంతర వేణి మహేష్ తదితరులు పాల్గొన్నారు
