Ram Charan | పెద్ది తెర వెనుక ఏం జరుగుతోంది..?

Ram Charan | పెద్ది తెర వెనుక ఏం జరుగుతోంది..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది. దీనికి బుచ్చిబాబు సానా డైరెక్టర్. ఉప్పెన సినిమా తర్వాత నుంచి ఈ కథ పైనే కసరత్తు చేసాడు. మార్చి 27న పెద్ది రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. అయితే.. గత కొన్ని రోజులు నుంచి పెద్ది నిజంగా వస్తుందా..? వాయిదా పడనుందా..? అనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు పెద్ది వాయిదా పడడం అనేది ఖాయమని.. దీనికి ఇదే కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఇంతకీ.. పెద్ది వాయిదాకి కారణం ఏంటి..?

పెద్ది రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతన్న సినిమా. ఇందులో చరణ్ లుక్ ఎంత మాస్ గా ఉందో చూసాం. ఇక ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఇక సెకండ్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ అని.. మళ్లీ మళ్లీ కన్ ఫర్మ్ చేస్తున్నా.. పోస్ట్ పోన్ అనే మాట బలంగా వినిపిస్తుంది. దీంతో పెద్ది వస్తుందా..? వాయిదా పడనుందా..? అనేది సస్పెన్స్ గా మారింది.

పెద్ది పోస్ట్ పోన్ చేయాలి అనుకోవడానికి కారణం ఏంటంటే.. మార్చి 19న బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ధురంధర్ సీక్వెల్ ధురంధర్ 2, రాక్‌స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ చిత్రాల పై బాలీవుడ్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. దీంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా కోసం థియేటర్లను బ్లాక్ చేసే పనిలో పడ్డారట. అందుచేత పెద్ది వాయిదా వేసుకుని తర్వాత వస్తే.. లాంగ్ రన్ తో పాటు ఎక్కువ కలెక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంటుందని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారట. ఈ కారణంగానే పెద్ది వాయిదా వేయనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. పెద్ది రిలీజ్ గురించి త్వరలో అఫిషియల్ గా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

