Indiramma’s House | ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేయాలి…

Indiramma’s House | ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేయాలి…

Indiramma’s House | కుంటాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను వేగవంతంగా చేపట్టాలని ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీ ఓ ఎంఏ అబ్దుల్ రహీంలు అన్నారు. ఈ రోజు కుంటాల మండలంలోని అందకుర్ కల్లూరు గ్రామాల్లోని ఇందిరమ్మ ఇండ్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను వేగవంతంగా చేపట్టాలని లబ్ధిదారులకు తెలియజేశారు.

అదేవిధంగా పురోగతిని అధికారులు సైతం కృషి చేయాలని పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విడతల వారిగా లబ్ధిదారుల ఖాతాలో ఇందిరమ్మ డబ్బులు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు పెంట వార్ దశరథ్, ప్రవళి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శులు రమ్య, భోజన్న, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply