Brain stroke | బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించిన కండక్టర్..

Brain stroke | బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించిన కండక్టర్..

Brain stroke | నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న బొమ్మ రాజ్ కుమార్ (42) బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు. మృతునికి రావలసిన శాఖాపరమైన పరిహారం వెంటనే చెల్లించాలని భార్యా పిల్లలు బంధువులతో నర్సంపేట బస్టాండ్ లో మంగళవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. నాలుగు నెలల క్రితం హన్మకొండ నుండి నర్సంపేట బస్సులో డ్యూటీ చేస్తున్న క్రమంలో ఒక టికెట్ కొట్టలేదని అధికారులు రాజ్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లరి గూడ గ్రామానికి చెందిన రాజకుమార్ 2010 నుండి కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం పూర్తిగా సర్వీస్ రిమూవ్ చేయడంతో మానసిక ఒత్తిడితో మృతి చెందాడంటూ బస్టాండ్లో మృతదేహంతో మృతుడి బంధువుల ఆందోళన కు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడు బొమ్మ రాజశేఖర్ భార్య భవాని, మృతుడి ఇద్దరు పిల్లలు డిమాండ్ చేస్తున్నారు.

మృతునికి ఇద్ద‌రు పిల్ల‌లు ఆధ్య( 9), అభినందన్( 7) ఉన్నట్లు తెలిపారు. బంధువుల ద్వారా బస్ స్టాండ్ లో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా నర్సంపేట ఎస్సైలు రవికుమార్, అరుణ్ కుమార్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి, మృతిని బంధువులతో మాట్లాడి ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి సకాలంలో శాఖపరమైన బెనిఫిట్స్ ఇప్పించడానికి కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply