Badminton | బ్యాట్మెంటన్ టోర్నీ ప్రారంభం

Badminton | బ్యాట్మెంటన్ టోర్నీ ప్రారంభం

Badminton | కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ఈ రోజు బ్యాట్మెంటన్ పోటీలను సర్పంచ్ జక్కుల గజేందర్ ప్రారంభించారు. మొత్తం 20 టీమ్ లు పోటీలలో పాల్గోవడం జరుగుతుందని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా షటిల్ కోర్టును ఏర్పాటు చేశారు. పోటీలను శారీరక మానసిక దృఢత్వం కోసం ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ సందర్భంగా క్రీడ‌లతో వెలికి తీసేందుకే క్రీడా పోటీలను ప్రతి ఏట సంక్రాంతికి ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోటీలను తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. బీఆర్ ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, మాజీ సర్పంచ్ జే.మహేందర్, ఉప సర్పంచ్ రమణా, నాయకులు బోగ లక్ష్మణ్, సట్ల శ్రీను, రాకేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply