ఉడుంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఉడుంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కారు బైక్ ఢీ ఒకరు మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు

కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలం ఉడుంపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి . ఉట్నూర్ వైపు నుండి కడెం వైపు వస్తున్న కారుకు కడెం వైపు నుండి ఉట్నూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాత ఉట్నూర్ గ్రామానికి చెందిన గొడిపెళ్లి నడిపి మల్లయ్య (60) మృతి చెందగా మరో ఇద్దరు గొడిపల్లి మల్లేష్, మల్కారి దుర్గయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిద్దరిని 108 వాహనంలో పైలట్ రాకేష్, ఈఎంటి మురళి ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. వీరు ముగ్గురు ఖానాపూర్ పనికి వెళ్లి తిరిగి ఉట్నూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.