RTC buss | మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

RTC buss | మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

  • భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు

RTC buss | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని జన గామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను స్టేషన్ ఘన్‌పూర్ నుంచి మేడారంకు నడపనున్న సందర్భంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు.

జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతి ఆదేశాల మేరకు జనగామ డిపో సేఫ్టీ వార్డెన్ కుర్ర సురేందర్ గౌడ్ ఈ విజ్ఞాపన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జనగామ డిపో మేనేజర్ స్టేషన్ ఘన్‌పూర్‌పై ప్రత్యే క దృష్టి సారించి భక్తుల సౌకర్యార్థం అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తిగా సురక్షితమని, బస్సులు నేరుగా తల్లి గద్దెల వరకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణించే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని డిపో మేనేజర్ ఎస్. స్వాతి తెలిపారు.

కావున మేడా రానికి వెళ్లే భక్తులందరూ ప్రైవేట్ వాహనాలకంటే ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించి ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఘన్‌పూర్ బస్టాండ్ కంట్రోలర్ ఈ.ఎస్. బాబు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply