Prime Minister | ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలు చేయాలి..

Prime Minister | ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలు చేయాలి..

  • గవర్నమెంట్ అఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ రిషి కాంత్

Prime Minister | జనగామ, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా లో ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలు చేయాలి అని గవర్నమెంట్ అఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ రిషి కాంత్ అన్నారు. ఈ రోజు ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలు పై కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ ఆఫీసర్ రిషి కాంత్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఇందులో భాగంగా గతంలో రూపొందించిన 6 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయిలో లక్ష్యాల సాధనపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. పథకంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు అనగా పంటల ఉత్పాదకత పెంపొందించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతుల అవలంబన, రైతులకు సులభతరంగా ఋణ సహాయం అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి , మేలైన నీటి యాజమాన్యం, వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి గురించి చర్యలు చేపట్టాలని టెక్నికల్ ఆఫీసర్,గవర్నమెంట్ అఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ రిషి కాంత్ సూచించారు.

పథకంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు అనగా పంటల ఉత్పాదకత పెంపొందించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతుల అవలంబన, రైతులకు సులభతరంగా ఋణ సహాయం అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి , మేలైన నీటి యాజమాన్యం, వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి గురించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ సూచించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార విభాగం, భూగర్భ జలాలు, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖలు, నాబార్డ్ ఎ జి ఎం, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply