Etela | మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

Etela | మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

Etela | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు దోషులు ఎవరో తేల్చాలని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావును ఇవాళ సిట్ విచారిస్తున్న విషయం తెలిసిందే. మూడున్నర గంటలకు పైగా మొదటి దశ విచారణ కొనసాగగా.. భోజన విరామం తర్వాత విచారణ పున:ప్రారంభమైంది. మరోవైపు జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హరీశ్ రావు వెంట లోనికి అడ్వొకేట్లను అనుమతించలేదని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

హరీశ్‌రావు సిట్ ఎదుట విచారణకు హాజరుకావడంపై ఈటల రాజేందర్ మాట్లాడుతూ… చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కేసులో దర్యాపు చేయడం తప్పు కాదని.. కానీ, నిజాయితీగా విచారణ జరపాలని పేర్కొన్నారు. చట్టంతో ఎవరు చెలగాటమాడినా.. ఇదే గతి పడుతుందనే విశ్వాసం ప్రజలకు కల్పించాలన్నారు.

Leave a Reply