మున్సిపల్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యతను వివరించారు.
అనంతరం బాయ్స్ హైస్కూల్‌లో ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని విద్యార్థుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన తొలి ప్రవేశ దరఖాస్తును స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు మాదాసి రవి, ముత్తినేని వెంకన్న, ఎలకంటి విజయ్ కుమార్, హనుమకొండ శ్రీధర్, అయూబ్ ఖాన్, వేముల సంధ్యారాణి సాంబయ్య గౌడ్, కొత్తకొండ మేఘన, బాణాల ప్రసన్న, శ్రీరామోజు రోజారాణి, పొన్నాల మనీషా, చీకటి స్వరూప, వేల్పుల శ్రీలత, ఇస్లావత్ రమా, మున్సిపల్ ఏఈ, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
