76Birthday | టీటీడీ నుంచి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం సమర్పణ
76Birthday | టీటీడీ నుంచి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం సమర్పణ
76Birthday | | తిరుమల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టీడీపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో టీటీడీ అర్చకులు వేదమంత్రాల నడుమ ఘనంగా వేదాశీర్వచనం నిర్వహించారు.
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ, ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం
