మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం

మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షుమాలికకు అమెరికాలోని బ్లూమింగ్ టన్ ఇండియానా యూనివర్శిటీ నుంచి అరుదైన పురస్కారం దక్కింది. ఐదేళ్లకు ఒకసారి ప్రెసిడెంట్ హెర్మన్ బివెల్స్ గౌరవార్థం అందించే ప్రతిష్టాత్మకమైన హెర్మన్ బి వెల్స్ సీనియర్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జీవిత కాలం ఉండేలా యూనివర్శిటీలో గౌరవప్రదంగా బంగారు ఫలకం పై ఆమె పేరును లిఖించారు. మాజీ మంత్రి రోజా, సెల్వమణి అమెరికాకు వెళ్లి కుమార్తె అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లి రోజా కూడా తన కుమార్తె సాధించిన విజయంపై గర్వం వ్యక్తం చేస్తూ, ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు రోజా కుమార్తెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
