BRS | బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్

BRS | బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్
BRS | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆయన ఎవరికీ కనపించకుండా ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆయన రాజకీయాలకు దూరమవుతున్నారనే ప్రచారం సాగింది. కానీ ఇవాళ జగిత్యాల బహిరంగ సభ నిర్వహణ ద్వారా మరోసారి ఆయన తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమయ్యారు.
నేడు జగిత్యాల బహిరంగ సభ (BRS Public Meeting)కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే సందర్భంగా ఈ సభ జరుగుతోంది. ఇవాళ సాయంత్రం 4:45కు ఎర్రవల్లి నుంచి జగిత్యాలకు బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద హెలిప్యాడ్‌లో దిగనున్నారు. హెలిప్యాడ్ నుంచి జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ నేతలంగా జగిత్యాల పార్టీ కార్యాలయంలో కేసీఆర్‌కు స్వాగతం పలకనున్నారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవుల సర్వమత ప్రార్థనలు చేయనున్నారు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీకానున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభకు వెళ్లనున్నారు. కేసీఆర్ ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకోనున్నారు. ఏడాది తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్న కేసీఆర్ రాకతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి.
