మీ ఇంటి ఆడబిడ్డగా అవకాశం ఇవ్వండి
మీ ఇంటి ఆడబిడ్డగా అవకాశం ఇవ్వండి
- 6వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి రాణి చందూలాల్
భైంసా, ఆంధ్రప్రభ : భైంసా పట్టణంలోని ఆరో వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటే ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆరవాడ్ కౌన్సిలర్ అభ్యర్థి రాణి చందులాల్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం ఆరో వార్డులో విస్తృతంగా ప్రచారం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన జరిగే పోలింగ్ లో చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
వార్డు ప్రజలు తనకు మద్దతి ఇచ్చి కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే 24 గంటల పాటు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వార్డు పరిధిలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా అన్నారు. ఇతర పార్టీల నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగవద్దని, సేవ చేసే వారిని ఎన్నుకోవాలన్నారు. ఆదరించి అవకాశం ఇస్తే అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
