మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నాయకుల సన్మానం

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నాయకుల సన్మానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన రవాణశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ను నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆధ్వర్యంలో ఆదిలాబాద్ డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, అదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, ఉట్నూర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులుమర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసినట్లు వారు తెలిపారు.

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యం కలిసి పలు విషయాలపై మాట్లాడినట్లు జిల్లా ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్యలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమం లో ఉట్నూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులుకొత్తపల్లి మహేందర్, బిరుదులలాజర్, కోడిప్రభాకర్ తదితరులు పాల్గొన్నారని వారు తెలిపారు.

Leave a Reply