మా నాయకుడు… మా చిన్ని!
- ఎన్‌టీఆర్ భవన్‌లో ఘనంగా ఎంపీ కేశినేని శివనాధ్ జన్మదిన వేడుకలు
- వందలాది కార్యకర్తలు, అభిమానుల సందడి..
- తమ అభిమాన నాయకునికి శుభాకాంక్షల వెల్లువ
(విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) జన్మదిన వేడుకలు సోమవారం విజయవాడలోని ఎన్‌టీఆర్ భవన్‌లో అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వందలాదిగా హాజరై చిన్ని కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతూ, ఆయన దీర్ఘాయుష్షు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, నాయకులు చాలామంది ఉంటారు… కానీ ‘మా నాయకుడు’ అని గుండె నిండా పిలిచే అదృష్టం కొందరికే దక్కుతుంది.

ఆ అదృష్టం విజయవాడ ప్రజలకు, తెలుగు దేశం కార్యకర్తలకు దక్కింది” అంటూ కొనియాడారు. వారు మాట్లాడుతూ, “చిన్ని పదవి కోసం రాజకీయాలు చేయరు,ప్రజల కోసం రాజకీయాలను సాధనంగా ఉపయోగిస్తారు. ప్రచారం కోసం కాదు, అభివృద్ధి కోసం పరితపిస్తారు. మాటలతో కాదు… పనులతో నమ్మకం గెలుచుకున్న నాయకుడు” అని ప్రశంసించారు. కార్యకర్తే నా బలం… కార్యకర్తలే నా కుటుంబం అనే మాటను కేవలం చెప్పడమే కాకుండా, ప్రతి రోజూ తన నడవడికతో నిరూపిస్తున్న నాయకుడు చిన్నినేనని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా పలకరిస్తారని, ప్రజల సమస్యను తన బాధ్యతగా స్వీకరిస్తారని, విజయవాడ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారని అన్నారు.
ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ విజయవాడకు కొత్త అవకాశాలు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ పార్లమెంట్‌లోనూ నగర సమస్యలను బలంగా వినిపిస్తున్న ప్రజా ప్రతినిధిగా చిన్ని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు. చిన్ని అంటే కమిట్‌మెంట్… చిన్ని అంటే డెవలప్‌మెంట్… చిన్ని అంటే విజయవాడ గర్వం” అని నాయకులు పేర్కొన్నారు. ప్రజల మధ్యకు వస్తే ఆప్యాయతను పంచే నాయకుడు, కార్యకర్తలను కలిస్తే ధైర్యాన్ని నింపే వ్యక్తి, అభివృద్ధి విషయంలో రాజీ పడని నాయకత్వం చిన్ని దని కొనియాడారు.
చిన్ని కోసం కేడర్ కాదు… కేడర్ కోసమే చిన్ని” అనే భావన ప్రతి కార్యకర్త హృదయంలో బలంగా ఉందని, అదే ఆయనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. అందుకే “చిన్ని అంటే ఒక పేరు కాదు… నమ్మకం. ఒక పదవి కాదు… బాధ్యత. ఒక వ్యక్తి కాదు… వేలాది కార్యకర్తల ఆత్మవిశ్వాసం, లక్షలాది ప్రజల విశ్వాసం” అని పేర్కొన్నారు. చివరగా, “మీ అడుగులు ప్రజల కోసంమీ ప్రయాణం అభివృద్ధి కోసం మీ నాయకత్వం విజయవాడ భవిష్యత్తు కోసం. మీరు నిండు నూరేళ్లు ప్రజల ప్రేమాభిమానాలతో, విజయాలతో, సేవా తపనతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం” అంటూ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
