ఉత్తమ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు

ఉత్తమ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని ఎంఈఓ మల్లికార్జున పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఈఓ మల్లికార్జున వివరాలు తెలియజేస్తూ రాప్తాడు మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు హై స్కూల్స్ నుండి 635 మంది పరీక్షలు రాయగా 531 మంది విద్యార్థిని విద్యార్థులు పాసయ్యారు. మండల వ్యాప్తంగా 84% ఉత్తీర్ణత శాతం వచ్చిందన్నారు.
గాండ్లపర్తి హైస్కూలు నుండి ప్రథమ స్థానం శశాంక్ 551 రెండవ స్థానం పూజిత 520 గొందిరెడ్డిపల్లి హై స్కూలు నుండి ప్రథమ స్థానం ఈ.రాజిత 563 రెండవ స్థానం ఏ.అన్వేష్ కుమార్ 506 విన్సెంట్ డీ పాల్ హై స్కూలు నుండి ప్రథమ స్థానం పి.భువన్ కుమార్ రెడ్డి 589 రెండవ స్థానం ఎస్.సమీరా 585 మూడవ స్థానం వి.లలిత కే.అంకిత 581 తో పాటు మిగతా విద్యార్థిని విద్యార్థులు కూడా ఉత్తమమైన, అత్యుత్తమమైన మార్కులు సాధించారని తెలియజేశారు. అనంతరంవిద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు. స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.అలాగే బంధువులు స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేశారు.
