Final Rites | మురళీనాయక్ కు రేపు అంత్యక్రియలు .. హాజరుకానున్న పవన్, లోకేష్

వెల‌గ‌పూడి – పాక్ సైన్యంతో విరోచితంగా పోరాడి అమరుడైన మురళీ నాయక్ బౌతికకాయానికి రేపు అతడి స్వగ్రామమైన సత్యసాయి జిల్లా కళ్లితండా లో అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు..ఈ అంతిమ‌యాత్ర‌లో ఎపి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన‌నున్నారు..కాగా, మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ లలిత భాయ్ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప‌వ‌న్ క‌ల్యాణ్ కార్యాలయం నుండి సమాచారం అందజేశారు.

కాగా మ‌హ‌రాష్ట్ర డిప్యూటీ సిఎం షిండే నేడు ముర‌ళీ నాయ‌క్ కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.. అలాగే వారి కుటుంబాన్ని ప్ర‌భుత్వ త‌రుపున ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. కాగా, ముర‌ళీ బౌతిక కాయం నేటి సాయంత్రం అతడి స్వ‌గ్రామ‌మైన క‌ళ్లితండాకు రానుంది.

Leave a Reply