విద్యుత్తు తీగల చోరీ…


విద్యుత్తు తీగల చోరీ…
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ లోని సెక్రెడ్ హార్ట్ హైస్కూల్ వెనకాల గల పలువురు రైతులకు చెందిన విద్యుత్ మోటార్ల సర్వీస్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి కాల్చి , తీసుకుపోయారని ఆదాయ పన్నుల శాఖ విశ్రాంత ప్రిన్సిపల్ కమిషనర్ తీపి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. తన రెండు విద్యుత్ మోటార్లకు సంబంధించిన సుమారు 50 మీటర్ల సర్వీస్ వైరు కట్ చేసుకుని, అక్కడే తగలబెట్టుకొని, దొంగిలించారని తెలిపారు.
అదే పరిసరాల్లోని అన్నెపు యాదగిరి రెండు వ్యవసాయ మోటార్లకు చెందిన 30 మీటర్ల సర్వీస్ వైర్, రైతు రంగారెడ్డి విద్యుత్ విద్యుత్ మోటార్ కు చెందిన 20 మీటర్ల సర్వీస్ వైరు కట్ చేసుకుని అక్కడే తగలబెట్టి తీసుకుపోయారని ఆ రైతులు చెప్పారు. తాము ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో ముగ్గురు, నలుగురు రైతుల వ్యవసాయ మోటార్ల సర్వీస్ వైరును దొంగలించారని రైతులు చెప్పారు .రైతులు అప్రమత్తంగా ఉండాలని, కాల్చిన రాగి తీగను పాత ఇనుప సామాన్లు కొనే వారికి అమ్ముకొని ఉంటారని వారు తెలిపారు. ఈ విషయమై పోలీసులు నిఘా పెట్టి, చర్యలు తీసుకోవాలని సదరు రైతులు కోరారు.
