గాంధీ నాయక్ ఆరోపణలు నిరాధారం..

  • బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష

తొర్రూరు, ఆంధ్రప్రభ : పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు గాంధీ నాయక్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష విమర్శించారు.

సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోవడం సరికాదన్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా కొందరు మహిళా మంత్రులు కార్యక్రమానికి హాజరు కాలేదని, దానిని కూడా రాజకీయంగా వక్రీకరించడం అవివేకమని అన్నారు.

అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెప్పు కోసం అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని గాంధీ నాయక్‌కు సూచించారు.