గోరికొత్తపల్లిలో విషాదం..

గోరికొత్తపల్లిలో విషాదం..
వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతి..
రేగొండ, ఆంధ్రప్రభ:
వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన గోరికొత్తపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే, గోరికొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన కట్ల సతీష్ (33) చేపలు పట్టేందుకు బొక్కి చెరువుకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు.
ఈ సమయంలో వలకు కాలు చిక్కుకోవడంతో సతీష్ బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఉపాధి కోసం చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్న సతీష్ పేద కుటుంబానికి చెందినవాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సతీష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై త్రిలోక్‌నాథ్ రెడ్డి తెలిపారు.
