4wins | కోల్‌క‌తా వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు

4wins | కోల్‌క‌తా వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు

4wins | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజ‌యాల‌తో దూసుకుపోతోంది. వరుసగా 4 విజయాలతో జోరు మీదుంది. సీజ‌న్ ఆరంభంలో ఆడిన మొదటి 6 మ్యాచ్‌లలో ఒక్క విజ‌యం కూడా సాధించ‌లేక‌పోయింది. ఇక కోల్‌క‌తా జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేర‌డం క‌ష్ట‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు సాధించింది. వరుసగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌లను ఓడించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఫీన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీపై ఫీన్ అలెన్ అజేయ సెంచరీ (47 బంతుల్లో 100*) చేసి, కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే కేకేఆర్ జట్టులో రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్ల రాణిస్తుండ‌టంతో ఆ జ‌ట్టు ప్లేఆఫ్ రేసులో ముందుకు వెళ్లుంది.

Leave a Reply