213 Absent Haryana : జన గణన జగడం Andhra Prabha Top Story

213 Absent Haryana : జన గణన జగడం Andhra Prabha Top Story
- గైర్హాజరీ సిబ్బందిపై సర్కారు కన్నెర్ర
- 5 జిల్లాల్లో కేసులు నమోదు
- మరి కొందరిపై సస్పెస్స్ వేటు
- 213 మందిపై కఠిన చర్యలకు సిద్ధం
- ఇదీ హర్యానాలో జనగణన రచ్చ
- ఉద్యోగ సంఘాలు ఆగ్రహం
ఆంధ్రప్రభ, ఫరీదాబాద్ ప్రతినిధి

హర్యానాలో జాతీయ జనాభా గణన జగడం తారా స్థాయికి చేరింది. జన గణన విధులకు డుమ్మా కొట్టిన ఉద్యోగులపై హర్యానా ప్రభుత్వం కొరడా ఝళిపించింది, 22 మంది ఉద్యోగులపై కేసులు నమోదు చేయగా… మరో 40 మందిపై కేసులు పెట్టాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇక చాలా మందిపై సస్పెన్షన్ వేటుకు వేసింది. ఈ అకస్మిక పరిణామాలపై హర్యానా ఉద్యోగులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
213 Absent Haryana : 5 జిల్లాల్లో కేసులు

గురుగావ్‌లో టీచర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సహా 10 మంది ఉద్యోగులపై రెండు రెండు పోలీసు కేసులు నమోదు కాగా, ఫరీదాబాద్‌లో తొమ్మిది మంది ఉద్యోగులపై మరో కేసును నమోదు చేశారు. కురుక్షేత్రలో ఇద్దరు క్లర్కులపై , భివానీ జిల్లాలో ఒక టీచర్ పై కేసు బుక్ చేశారు. ఇక 22 మంది ఉద్యోగులపై కేసు నమెదు చేయాలని ఫరీదాబాద్ పోలీసులకు అదనపు సిఫార్సులను ప్రభత్వం పంపగా, సోనిపత్ పోలీసులకు మరో 18 మంది ఉద్యోగులపై సిఫార్సు లేఖలు అందాయి. ఎలాంటి కారణాలు చెప్పకుండా జనగణన విధులకు గైర్హాజరైనందుకు 10 మంది ఉద్యోగులపై రెండు కేసులు నమోదు చేసినట్లు గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రదీప్ దహియా ధృవీకరించారు. 1948 జనగణన చట్టంలోని సెక్షన్ 11 కింద ఈ కేసులు నమోదు చేశారు.
213 Absent Haryana : డుమ్మా కొట్టటం నిర్లక్ష్యమే

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఉద్యోగులు తగిన శ్రద్ధతో తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారు, తద్వారా సజావుగా సాగే జనగణన కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. మే 18న గుర్గావ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసు ప్రకారం, “తప్పనిసరి శిక్షణకు హాజరు కాలేదు. ఒక ప్రధాన జాతీయ బాధ్యత విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఇది విధి నిర్వహణలో వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది… గణన అధికారి తప్పనిసరి జనగణన శిక్షణకు హాజరుకావడమే కాకుండా, ఎప్పటికప్పుడు జారీ చేసిన అధికారిక సూచనలను పాటించడానికి కూడా నిరాకరించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది . అధికారిక జనగణన పని సజావుగా జరగడానికి ఆటంకం కలిగించింది, తద్వారా జనగణన కార్యకలాపాల సన్నద్ధత , పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపింది.” అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని శాఖలను కోరినట్లు దహియా తెలిపారు. ఇంకా 213 మంది జనగణన విధులకు హాజరుకాలేదని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
213 Absent Haryana : ఉద్యోగ సంఘాలు ఆగ్రహం
ఈ చర్యపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. విచారణ లేకుండా పోలీసు కేసులు నమోదు చేయటం, సిబ్బందిని సస్పెండ్ చేయటం కఠినం, అన్యాయం అని ఉద్యోగులు వాదించారు. కొందరు ఉద్యోగులకు వాస్తవ పరిస్థితుల్లో గైర్హాజరుకు కారణాలను ముందుగా పరిశీలించ లేదని ఉద్యోగ సంఘాల నాయకులు గరం గరం అవుతున్నారు.
213 Absent Haryana : టీచర్లకు కష్టకాలమే

కొంతమంది ఉపాధ్యాయులకు తాము పని చేసే పాఠశాలలకు 60 కిలోమీటర్ల దూరంలో జనగణన విధులను కేటాయించారని, దీనివల్ల బోధన, జనగణన పనులను సమతుల్యం చేసుకోవడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో ఎన్నికల విధుల వల్ల బోధనకు అంతరాయం కలిగిందని, వేలాది టీచరు పోస్టులు ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు జనగణన పనులను అప్పగించడం అన్యాయమని ఆయన అన్నారు. దీనికి బదులుగా నిరుద్యోగ యువతను జనగణన సిబ్బందికి సహాయపడటానికి నియమించాలని ఆయన సూచించారు. అనారోగ్యం , కుటుంబ అత్యవసర పరిస్థితుల వంటి కారణాలు ఉండవచ్చని, అటువంటి సందర్భాలలో ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంతో సిబ్బంది సమస్యలను మరింత పెంచుతుందని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుభాష్ లాంబా అన్నారు.
213 Absent Haryana : మే 30 డెడ్ లైన్…

హర్యానాలో జనగణన పనులు అధికారికంగా మే 1, 2026న ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల జాబితా, గణన కార్యకలాపాలు మొదలయ్యాయి. జనగణన 2027కు సంబంధించిన సమాచారం కోసం పౌరులు జాతీయ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1855ను సంప్రదించవచ్చు. ఇక్కడ ఇళ్ల జాబితా, గృహ గణనకు సంబంధించిన ప్రశ్నలకు వారి సొంత భాషలో సమాధానాలు లభిస్తాయి. హర్యానా జనగణన కార్యకలాపాల డైరెక్టర్ లలిత్ జైన్ మాట్లాడుతూ, ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశం తర్వాత జనగణన పనులు వేగవంతమయ్యాయని, మే 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోహర్యానా వ్యాప్తంగా ఉన్న మొత్తం ఇళ్ల జాబితా బ్లాకులలో 97 శాతానికి పైగా పనులు ప్రారంభమయ్యాయని, యమునా నగర్, కురుక్షేత్ర, కైతల్, కర్నాల్, ఫతేహాబాద్, హన్సి, చర్ఖీ దాద్రి మరియు ఫరీదాబాద్ వంటి జిల్లాలలో ఇళ్ల జాబితా కార్యకలాపాలు 100 శాతం ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.
ALSO READ : Rs 5 Lakh Baby : అంగట్లో పసిగుడ్లు Andhra Prabha Top Story
