కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేష్..
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేష్..
- ఇంద్రకీలాద్రిపై అపూర్వ స్వాగతం
- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు..
- కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు..
- ప్రైవేట్ వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు ఆశీస్సులు
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి ; విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈఓ శీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి లోకేష్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం చెప్తావ్ ప్రసాదాలను అందజేశారు.

మంత్రి లోకేష్ దర్శన కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఉప ప్రధానాలయ అర్చకులు శంకర్ శాండిల్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ మహామండపం మొదటి అంతస్తులో నిర్వహించిన ప్రైవేట్ వివాహ వేడుకకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
