చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మజ్జిగ పంపిణీ

చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మజ్జిగ పంపిణీ
భవానిపురం, ఆంధ్రప్రభ : విజనరీ నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సోమవారం పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ అధ్యక్షులు మోరబోయిన రాంబాబు ఆధ్వర్యంలో డివిజన్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ డివిజన్లో అన్న క్యాంటీన్ సందర్శించి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, మోరబోయిన రాంబాబు, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
