19 years | టాలీవుడ్‌లో దూసుకుపోతున్న డింపుల్ హయాతి!

19 years | టాలీవుడ్‌లో దూసుకుపోతున్న డింపుల్ హయాతి!

19 years | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి, మోడల్ డింపుల్ హయాతి. 19 ఏళ్ల ప్రాయంలోనే ‘గల్ఫ్’ (2017) సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ‘యురేకా’ (2020) సినిమాతో నటిగా మార్కులు కొట్టేసిన డింపుల్, గద్దలకొండ గణేష్ (2019) చిత్రంలోని ‘జర్రా జర్రా’ ఐటెం సాంగ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పాటలో ఆమె చూపిన గ్లామర్, ఎనర్జీ కుర్రకారును ఫిదా చేశాయి.

డింపుల్ కెరీర్‌లో వైవిధ్యాన్ని కోరుకుంటూ ఇతర భాషల్లోనూ సత్తా చాటుతోంది. ప్రభుదేవాతో కలిసి ‘దేవి 2’ (2019) ద్వారా తమిళంలోకి, ‘అత్రంగి రే’ (2021) ద్వారా హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. రవితేజ సరసన ‘ఖిలాడి’ (2022)లో తన గ్లామర్ డోస్ పెంచి మెప్పించగా, విశాల్‌తో ‘వీరమే వాగై సూడుమ్’ (2022), గోపీచంద్‌తో ‘రామబాణం’ (2023) వంటి చిత్రాల్లో నటించి వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. గతేడాది ‘దిల్మార్’ (2025) సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది.

ఇక 2026 సంవత్సరం డింపుల్‌కు కెరీర్ పరంగా చాలా కీలకంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW) సినిమాలో బలమణి పాత్రలో రవితేజ సరసన మెరిసింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘భోగి’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ కనిపిస్తూ టాలీవుడ్ రేసులో డింపుల్ స్పీడ్ పెంచుతోంది.

19 years
19 years

Leave a Reply