300 units | తల్లికి వందనం పథకం రెడీ

300 units | తల్లికి వందనం పథకం రెడీ
స్కూల్స్ రీ ఓపెన్ అయిన రోజే నగదు జమ
ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన మంత్రి లోకేష్
ఈ ఏడాది 78 లక్షల విద్యార్థులకు పథకం అమలు

300 units | అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో పాఠశాలలకు విద్యార్ధులకు పంపే తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఈ ఏడాది కూడా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పాఠశాలలు ప్రారంభమైన తొలివారంలోనే ఆ నిధులు తల్లులు ఖాతాలో జమ చేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలతో ఇప్పటికే వివరాలు సేకరించిన అధికారులు వాటిని క్షేత్రస్దాయిలో తనిఖీ చేయిస్తున్నారు. ఇది పూర్తి కాగానే డబ్బులు జమ చేస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది 78 లక్షల విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలుకు వీలుగా ప్రభుత్వం వద్దకు సమాచారం చేరింది. వివిధ స్కూళ్లు, కాలేజీల నుంచి విద్యార్థుల వివరాలు విద్యాశాఖకు చేరాయి. దీంతో వీటిని సచివాలయాల వద్దకు పంపి క్షేత్రస్ధాయిలో తనిఖీలు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ మరో రెండు, మూడు వారాల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత తుది అర్హుల జాబితా ఖరారు చేస్తారు. అనంతరం జూన్ 12న తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం మొత్తాలు జమ అవుతాయి.
300 units | తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి..
అయితే తల్లికి వందనం మొత్తాలు సక్రమంగా ఖాతాల్లో పడాలంటే మాత్రం కొన్ని అంశాలు తప్పనిసరిగా ఉండాలి. వీటిలో తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే కుటుంబానికి భూమి మాగాణి అయితే 3 ఎకరాలకు లోపు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. కారు ఉండకూడదు. కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటకూడదు. ఇల్లు వెయ్యి చదరపు అడుగల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసిన వారికీ వర్తించదు. తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాది కూడా రూ.13 వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి.
CLICK HERE TO READ MORE : prime minister | అలాగే ఎస్కార్ట్, భ్రదత సిబ్బంది కూడా కుదింపు
